Kaleshwaram
* కార్తీక పౌర్ణమి స్నానానికి వచ్చి గల్లంతు..
* గాలింపు తర్వాత లభ్యమైన మృతదేహం
ఆకేరు న్యూస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కార్తీక పౌర్ణమి (Karthika Pournami) వేడుకల వేళ విషాదం చోటుచేసుకుంది. కాళేశ్వరం (Kaleshwaram) వద్ద గోదావరి నదిలో (Godavari River) పుణ్యస్నానానికి వెళ్లిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 14 ఏళ్ల విద్యార్థి నీటిలో మునిగి మృతిచెందాడు. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం (Chhattisgarh) బీజాపూర్‌కు చెందిన రనావత్ సాహు అనే 14 ఏళ్ల బాలుడు కుటుంబ సభ్యులతో కలిసి కాళేశ్వరంలోని శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయానికి దర్శనం కోసం వచ్చాడు. ఈ క్రమంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వెళ్లాడు. స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు.
కుటుంబ సభ్యులు ఎంత వెతికినా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన కాళేశ్వరం ఎస్సై సురేష్, పోలీసు సిబ్బంది, గంగపుత్రుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటి తర్వాత బాలుడి మృతదేహం లభ్యమైంది.
బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికులను సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం మహదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

