Farmer Death
* రైతును బలిగొన్న విద్యుత్ షాక్!
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై ఓ యువరైతు ప్రాణాలు కోల్పోయాడు. పొలానికి నీరు పెట్టేందుకు మోటార్ ఆన్ చేయడానికి వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఏటూరునాగారం ఎస్సై-2 కాంతారావు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక గ్రామానికి చెందిన బషీర్ అహ్మద్ తన అత్తగారి గ్రామమైన చిన్నబోయినపల్లిలో ఓ రైతుకు చెందిన భూమిని కౌలుకు (Lease) తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.
ఈ క్రమంలో మంగళవారం తన పొలంలోని మోటార్‌ను ఆన్ చేసేందుకు ట్రాన్స్ఫార్మర్ (Transformer) వద్దకు వెళ్లాడు. విద్యుత్ సరఫరా కోసం లివర్‌ను ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు (Electric Shock) గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడి భార్య మెహరునిసా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు (Investigation) చేస్తున్నట్లు ఎస్సై కాంతారావు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

