Cityflo Shuttle Bus Services
* మూడు రోజుల పాటు ఉచిత బస్సులు!
* 26 నుంచి 28 వరకు సిటీఫ్లో ప్రత్యేక షటిల్ సేవలు..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులకు శుభవార్త. ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో సైబరాబాద్ మూవ్స్ 2026 (Cyberabad IT employees) అర్బన్ మొబిలిటీ కాన్క్లేవ్ సందర్భంగా మూడు రోజుల పాటు ఉచిత బస్సు సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రీమియం బస్ కమ్యూట్ నెట్వర్క్ సిటీఫ్లో (Cityflo) నవంబర్ 26 నుంచి 28 వరకు ప్రత్యేక షటిల్ సర్వీసులను నిర్వహించనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ బస్సులు నడుస్తాయి.
* రెండు మార్గాల్లో ఉచిత షటిల్ బస్సులు..
సదస్సు జరిగే టీ-హబ్‌కు ఐటీ ఉద్యోగులు, సందర్శకులు సులభంగా చేరుకునేలా రెండు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశారు. మొదటి మార్గం టీసీఎస్ కోహినూర్ పార్క్ నుంచి టీ-హబ్ వరకు ఉంటుంది. కొండాపూర్, కొత్తగూడ, హైటెక్ సిటీ, పత్రికానగర్, మాదాపూర్, హెచ్‌యూడీఏ టెక్నో ఎన్క్లేవ్, రాయదుర్గ్, నాలెడ్జ్ సిటీ ప్రాంతాలను కలుపుతూ ఈ బస్సులు నడుస్తాయి.
మార్గమధ్యంలో గూగుల్, టెక్ మహీంద్రా, డెల్, సైబర్ టవర్స్, రహేజా మైండ్‌స్పేస్, మైండ్‌స్పేస్ సీగేట్ ప్రాంతాల్లో స్టాప్‌లు ఉంటాయి. రెండో మార్గం వేవ్‌రాక్ నుంచి టీ-హబ్ వరకు ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి, రాయదుర్గ్ మీదుగా సాగే ఈ మార్గంలో ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్, ఐడీబీఐ బ్యాంక్, బయోడైవర్సిటీ, మై హోమ్ ట్విట్జా ప్రాంతాల్లో బస్సులు ఆగుతాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి పరిసరాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ సేవలు ఉపయోగపడనున్నాయి.
* ప్రతి 20–30 నిమిషాలకు ఒక బస్సు..
నవంబర్ 26, 27, 28 తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రతి 20 నుంచి 30 నిమిషాలకు ఒక బస్సు నడపనున్నారు. ప్రయాణికులకు వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు ఉచిత రౌండ్‌ట్రిప్ సేవలను కల్పిస్తున్నారు. దీంతో ఉద్యోగులు, సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు వ్యక్తిగత వాహనాలపై ఆధారపడకుండా టీ-హబ్‌కు చేరుకోవచ్చు.
* ప్రజా రవాణా వినియోగం పెంచడమే లక్ష్యం..
సైబరాబాద్ మూవ్స్ 2026 పేరుతో నిర్వహిస్తున్న ఈ మూడు రోజుల అర్బన్ మొబిలిటీ కాన్క్లేవ్ టీ-హబ్‌లో జరగనుంది. సైబరాబాద్ పోలీస్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఇండియా, షిఫ్ట్ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్ సంస్థలు సహకరిస్తున్నాయి.
నగరాల్లో పెరుగుతున్న వాహనాల సంఖ్య, ట్రాఫిక్ రద్దీ, ప్రయాణ సమయం, వాయు కాలుష్యం వంటి సమస్యలకు మెరుగైన రవాణా వ్యవస్థల ద్వారా పరిష్కారాలను అన్వేషించడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం.
ఐటీ కారిడార్‌లో (Cyberabad IT employees) కేవలం 2 శాతం మంది మాత్రమే ప్రజా రవాణాను వినియోగిస్తుండగా, 82 శాతం మంది వ్యక్తిగత వాహనాలపై ఆధారపడుతున్నట్లు అందించిన వివరాలు సూచిస్తున్నాయి. ఈ పరిస్థితిని మార్చి, ప్రజా రవాణా వైపు ఉద్యోగులను ప్రోత్సహించడంలో భాగంగానే ఉచిత షటిల్ సేవలను ఏర్పాటు చేశారు.
Also Read : ట్రక్ పార్కు భూములపై రణరంగం

Please tell us what is wrong. Your report will be sent to the website team.

