పార్థివ దేహానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి
* మృతుల చిత్రపటాలు, పార్థివ దేహాలకు పూలమాలలతో నివాళులు..
* బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చిల్పూర్ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామ సర్పంచ్ భర్త వీరస్వామి తండ్రి శివరాత్రి వీరయ్య మృతి చెందగా, ఆయన పార్థివ దేహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అదేవిధంగా పల్లగుట్ట గ్రామానికి చెందిన తన మిత్రుడు గిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లికి చెందిన పిట్టల శ్రీనివాస్ మృతి చెందగా, ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, చిల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ర నాగరాజు, స్టేషన్ ఘన్పూర్ పట్టణ అధ్యక్షుడు అంబటి కిషన్ రాజ్, వివిధ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

