ములుగులో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
* రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ బాధ్యతలు నిర్వర్తించాలి
* జిల్లా అదనపు కలెక్టర్లు
ములుగు, ఆకేరు న్యూస్: భారత రాజ్యాంగ స్ఫూర్తిని (Constitution Day 2026) ప్రతి ఒక్కరూ అలవరచుకొని, రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ తమ విధులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా అదనపు కలెక్టర్లు సీహెచ్. మహేందర్ జీ, ఎం. సంపత్ రావు అన్నారు.
* పీఠిక చదివి ప్రతిజ్ఞ చేసిన అధికారులు..
భారత రాజ్యాంగ దినోత్సవం (Constitution Day) సందర్భంగా గురువారం ములుగు జిల్లా కలెక్టరేట్లో అధికారులు, ఉద్యోగులతో కలిసి అదనపు కలెక్టర్లు భారత రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు.
* 1949లో రాజ్యాంగానికి ఆమోదం..
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ.. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిందని తెలిపారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తోందని వివరించారు.
* రాజ్యాంగ విలువలను ఆచరణలో పాటించాలి..
భారత రాజ్యాంగంలోని మూల సూత్రాలు, ఆశయాలు, విలువలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడంతో పాటు వాటిని ఆచరణలో పాటించాలని సూచించారు. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఆదర్శాలను గుర్తుచేసుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Also Read : ఏపీలో స్థానిక ఎన్నికల సందడి..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

