Karthika Deepam
* కేపీహెచ్బీలో విషాదం
* ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సింధు మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కార్తీక మాసంలో భక్తిశ్రద్ధలతో వెలిగించిన దీపం ఓ యువతి కుటుంబంలో విషాదాన్ని నింపింది. కార్తీక దీపం (Karthika Deepam) వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు చీరకు మంటలు అంటుకోవడంతో 18 ఏళ్ల సింధు ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన హైదరాబాద్లోని కేపీహెచ్బీ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కార్తీక మాసం (Karthika Deepam) సందర్భంగా సింధు తన ఇంటి గేటు వద్ద కార్తీక దీపం వెలిగించింది. ఈ క్రమంలో అనుకోకుండా దీపం మంటలు ఆమె చీరకు అంటుకున్నాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో సింధు తీవ్రంగా గాయపడింది.
ఈ ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో సింధు ప్రాణాలు కోల్పోయింది. చిన్న వయసులోనే సింధు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పండుగ సందర్భంగా జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది.
కార్తీక మాసంలో దీపాలు వెలిగించే సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. ముఖ్యంగా చీరలు, వదులుగా ఉండే దుస్తులు ధరించినప్పుడు దీపాల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Also Read : చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

Please tell us what is wrong. Your report will be sent to the website team.

