* మూసీ పరివాహక ప్రాంతాల్లో హోరెత్తుతున్న మైకులు
* ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తివేత
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హెచ్చరిక.. తక్షణం సురక్షిత ప్రాంతాలకు వెళ్లం డి.. అంటూ మూసీ పరివాహక ప్రాంతాల్లో మైకులు మోతెక్కుతున్నాయి. ఉస్మాన్‌సాగర్(OSMAN SAGAR), హిమాయత్‌సాగర్(HIMAYATH SAGAR) గేట్లు ఎత్తివేయడంతో అధికారులు అలర్ట్ చేస్తున్నారు. జీహెచ్ ఎంసీ(GHMC), పోలీసులను వాటర్ బోర్డు(WATER BOARD) అలర్ట్ చేసింది. వారు ప్రజలను అప్రమత్తం చేశారు. కాగా, ఎగువ నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరాయి. ముందుజాగ్రత్తగా ఉస్మాన్‌సాగర్ 2 గేట్లను అడుగుమేర ఎత్తి 226 క్యూసెక్కుల నీటిని మూసీకి విడుదల చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్ పూర్తి నీటిమట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1787.95 అడుగులకు చేరింది. హిమాయత్ సాగర్ ఒక గేటు అడుగు మేర ఎత్తి 340 క్యూసెక్కుల నీటిని మూసీకి విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ పూర్తి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1761.10 అడుగులకు చేరింది.