ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందిన జానీ మాస్టర్(Johny Master) పై లైంగికదాడి, పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నై(Chennai), ముంబై(Mubai), హైదరాబాద్(Hyderabad)తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ చేస్తున్నప్పుడు, నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం బాధితురాలు నార్సింగి(Narsing)కు చెందిన దైనందున అక్కడి పోలీసులకు కేసు బదిలీ చేశారు. కాగా, జానీ మాస్టర్‌పై ఐపీసీ సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506), స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2) మరియు (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా జానీ మాస్టర్‌పై పలు కేసులు నమోదయ్యాయి. 2015లో ఓ కాలేజిలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్‌లోని స్థానిక కోర్టు జానీ మాస్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కాగా, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన(Janasena) గెలుపు కోసం జానీ మాస్టర్ శ్రమించారు. పార్టీకి చెందిన కీలక గీతానికి కొరియోగ్రాఫీ చేసి నటించారు.
————————————-