బాలాపూర్ గణపతి లడ్డూ వేలంపాటలో 30 లక్షల వెయ్యి రూపాయలకు దక్కించుకున్న కొలను శంకర్ రెడ్డి
* రికార్డుస్థాయిలో బాలాపూర్ లడ్డూ
* గతేడాది 27 లక్షలు పలికిన లడ్డూ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బాలాపూర్ గణపతి లడ్డూ వేలంలో రికార్డుస్థాయిలో ధర పలికింది. గతంలో లేని విధంగా అత్యధిక ధర పలికింది. ఉత్కంఠగా జరిగిన వేలంపాటలో 30 లక్షల వెయ్యి రూపాయలకు కొలను శంకర్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. సంబంధిత సొమ్మును జనాల మధ్యే ఉత్సవ నిర్వాహకులకు అందజేశారు. గతేడాది ఈ లడ్డూ 27 లక్షల ధర పలికింది. ఏటా బాలాపూర్ గణపతి వేలం రికార్డును బ్రేక్ చేస్తూనే ఉంటోంది. లంబోదరుడి చేతిలో పూజలు అందుకున్న లడ్డును దక్కించుకుంటే, వారింట సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. తొలిసారిగా బాలాపూర్‌లో 1980లో గణేశుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఉత్సవ నిర్వాహకులు 1994లో మొదటిసారి లడ్డూ వేలం నిర్వహించారు. తొలి వేలం పాటలో రూ.450కి స్థానికుడు కొలను మోహన్‌రెడ్డి గెలుపొందారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
