* 8 మంది మృతి, మూడు వేల మందికి పైగా గాయాలు
* హిజ్బుల్లా సభ్యులే టార్గెట్
* ఇజ్రాయేల్ పనేనని అంటున్న లెబనాన్
ఆకేరు న్యూస్, డెస్క్ : లెబనాన్ రాజధాని బీరూట్‌లో భారీ పేలుళ్ళు ( Blasts ) జరిగాయి. గత సంఘటనలకు భిన్నంగా ఈ పేలుడు సంభవించింది. లెబనాన్ ( Lebanon ) లో కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తున్న పేజర్లు ( Pagers ) ఒక్క సారిగా పేలిపోయాయి. ఈ సంఘటనల్లో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందగా దాదాపు మూడు వేల మందికి పైగా గాయాల పాలయినారని లెబనాన్ అధికారులు చెబుతున్నారు. పేలుడు సంఘటనలకు సంబందించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పేలుడు ఘటనలు హజ్బుల్లా సభ్యులను టార్గెట్ చేస్తూ జరిగినట్టు గా తెలుస్తోంది. దీంతో ఈ పేలుళ్ళ వెనుక ఇజ్రాయేల్ ( Israel) ఉందని లెబనాన్ అధికారులు అంటున్నారు. ఇంతకుముందెప్పుడూ కూడా ఇలాంటి దాడులు జరగలేదంటున్నారు. అతి చిన్న పరికరంగా ఉండే పేజర్లు ఒక్కసారిగా పేలి పోవడంతో లెబనాన్ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
* టెక్ వార్..
యుద్ధంలో ఇప్పటివరకు తుపాకులు, రాకెట్లు, క్షిపణులు పరస్పరం వాడారు. ఇజ్రాయేల్ ఈ సారి సరికొత్త యుద్ధానికి తెరతీసిందని యుద్ధ నిపుణులు అంటున్నారు. తూటాలు, తుపాకులు, బాంబులు, రాకెట్లు లేకుండానే ప్రత్యర్థులను దెబ్బతీస్తున్నారు. లెబనాన్‌లో జరిగిన ఈ సరికొత్త టెక్నాలిజీని ఉపయోగించి హిజ్బుల్లా సభ్యుల పేజర్లను పేల్చి వేశారు. దీని వెనుక ఇజ్రాయెల్ ఉందని లెబనాన్ అధికారులు అంటున్నారు. ఇక పేజర్లతో పాటు సెల్ ఫోన్లు సైతం పేలిపోయే అవకాశాలు ఉంటాయా అన్న అనుమానాలు ఇపుడు లెబనాన్ ప్రజలను వేదిస్తున్న సమస్య.
——————————