* సూపర్మూన్, చంద్రగ్రహణం ఒకేరోజు
* ఆవిష్కృతం కాబోతున్న అద్భుత దృశ్యం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఈ రోజు రాత్రి ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతున్నది. ఈ సంవత్సరంలో నేడు రెండో చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఇది పాక్షిక గ్రహణం కాగా.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కనిపించనున్నది. అయితే, ఈ చంద్రగ్రహణం చాలా ప్రత్యేకం. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో వచ్చిన సమయంలోనే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీంతో భూమి కారణంగా సూర్యకాంతి చంద్రుడిపై పడదు. ఈ దృగ్విషయాన్ని చంద్రగ్రహణంగా పిలుస్తారు. వాస్తవానికి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఉపగ్రహమైన చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తుంటాడు. సూర్యుడి, చంద్రుడి మధ్య భూమి వచ్చిన సమయంలో సూర్యకాంతి చంద్రుడిని చేరుకోలేకపోతుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో వచ్చిన సమయంలో భూమినీడ చంద్రుడిపై పడుతుంది. దీన్ని చంద్రగ్రహణంగా పిలుస్తుంటారు. అయితే, ఈ గ్రహణం భారత్లో కనిపించేందుకు అవకాశం లేదు. 4 గంటల 6 నిమిషాల పాటు చంద్రగ్రహణం కొనసాగుతుంది. అలాగే గురువారం చంద్రుడు సాధారణ పౌర్ణమి రోజుల్లో కంటే కాస్త పెద్దగా కనిపించడం వల్ల సూపర్మూన్గా పిలుస్తుంటారు. యూరప్, ఆఫ్రికా, నార్త్, సౌత్ అమెరికాతో పాటు ఆసియాలోని కొన్ని దేశాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది
……………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
