ENE Repeat Movie Team
* నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు
ఆకేరు న్యూస్, సినిమా: ‘ఈ నగరానికి ఏమైంది’ (Ee Nagaraniki Emaindi) సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న గ్యాంగ్ మరోసారి సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ఈఎన్ఈ రిపీట్’ (ENE Repeat) నవంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘బతుకమ్మ’ (Bathukamma song) పాట ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని పెంచుతోంది.
తరుణ్ భాస్కర్ దాస్యం (Tharun Bhasker) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి తమ పాత పాత్రల్లోనే కనిపించనున్నారు. ఈ చిత్రంలో శివాత్మిక రాజశేఖర్ (Shivathmika Rajashekar) కీర్తన అనే కీలక పాత్రలో నటిస్తున్నారు.
తాజాగా విడుదలైన బతుకమ్మ పాటకు ఆస్కార్ విజేత చంద్రబోస్ (Chandrabose) సాహిత్యం అందించగా, వివేక్ సాగర్ (Vivek Sagar) సంగీతం సమకూర్చారు. ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) తన మధురమైన గాత్రంతో పాటకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చారు. ఈ పాట విడుదల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చిత్రబృందం సినిమా విశేషాలను పంచుకుంది.
- థియేటర్లలో పండగలా ఉంటుంది: తరుణ్ భాస్కర్
దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘సఖి’ (Sakhi) సినిమాలోని ‘ఏడే ఏడేడే’ పాట తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. తన సినిమాల్లోనూ అలాంటి పాట చేయాలనే కోరిక ఈ చిత్రంతో నెరవేరిందన్నారు. బడ్డీ కామెడీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఒక కొత్త కుటుంబం కనిపిస్తుందని, కథతో ఆ కుటుంబానికి ఉన్న సంబంధం మొదటి 15 నిమిషాల్లోనే అర్థమవుతుందని చెప్పారు.
ఈ పాటకు తాను కూడా డ్యాన్స్ చేయడం కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. వివేక్ సాగర్ అద్భుతమైన సంగీతం అందించగా, చంద్రబోస్ ఎంతో మార్గనిర్దేశం చేశారని ప్రశంసించారు. శివాత్మిక డ్యాన్స్ కూడా ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. ఇది ఒక ఫెస్టివల్ సాంగ్ అని, థియేటర్లలో ప్రేక్షకులకు పండగ వాతావరణాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సినిమాలో ఈ పాట ఎందుకు వస్తుందో నవంబర్ 19న తెలుస్తుందని ఆసక్తి పెంచారు.
* కీర్తన మనసులోని భావాలే పాట: చంద్రబోస్
పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో పాట రాసే అవకాశం ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ బతుకమ్మ పాట వినూత్నంగా ఉంటుందని చెప్పారు. నేటి యువతుల్లో స్వేచ్ఛా భావాలు, స్వతంత్ర ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, అలాంటి ఆలోచనలు కలిగిన అమ్మాయే సినిమాలోని కీర్తన పాత్ర అని వివరించారు. తన కోరికలు, ఆశలు, ప్రశ్నలను బతుకమ్మతో పంచుకుంటూ తన భావాలను వ్యక్తం చేయడమే ఈ పాటలోని ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
* బతుకమ్మ పాటే నా ఫేవరెట్: అభినవ్ గోమఠం
నటుడు అభినవ్ గోమఠం మాట్లాడుతూ.. పాటను చూసి ఎంతో ఆశ్చర్యపోయానని, ఇది అద్భుతంగా వచ్చిందని అన్నారు. థియేటర్లలో ప్రేక్షకులు ఈ పాటను మరింతగా ఆస్వాదిస్తారని పేర్కొన్నారు. శివాత్మిక అద్భుతంగా నటించిందని, వివేక్ సాగర్ సంగీతం ప్రత్యేకంగా ఉందని ప్రశంసించారు. ఈ పాట తనకు ఫేవరెట్‌గా మారిపోయిందని తెలిపారు.
* మంచి పాత్రతో పాటు గొప్ప పాట: శివాత్మిక
నటి శివాత్మిక మాట్లాడుతూ.. తన జీవితంలోకి కీర్తన పాత్ర రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబోస్ సాహిత్యానికి, శ్రేయా ఘోషల్ గాత్రానికి అభిమాని కావడం తన అదృష్టమని చెప్పారు. మంచి పాత్రతో పాటు ఇలాంటి గొప్ప పాటలో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు.
* పాటను ఆస్వాదించాను: శ్రీనాథ్ మాగంటి
నటుడు శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ.. చంద్రబోస్ సాహిత్యం, వివేక్ సాగర్ సంగీతం, ఈశ్వర్ కొరియోగ్రఫీ, శ్రేయా ఘోషల్ గాత్రం పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయని అన్నారు. శివాత్మిక నటన కూడా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ప్రేక్షకులు కుటుంబంతో కలిసి నవంబర్ 19న థియేటర్లకు రావాలని కోరారు.
* మరో కొత్త గ్యాంగ్ కూడా ఉంది!
నటుడు వెంకటేష్ కాకుమాను సినిమాలో మరో కొత్త గ్యాంగ్ కూడా ఉంటుందని వెల్లడించారు. తమ జీవితంలోకి కూడా ఒక బతుకమ్మ వచ్చినట్లుగా ఉందని సరదాగా వ్యాఖ్యానించారు. మహిళలు జీవితంలో పోషిస్తున్న ముఖ్యమైన పాత్రను గుర్తుచేసుకుంటూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మాత సందీప్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. గతంలో విడుదలైన ‘మిత్వా’ పాటకు మంచి స్పందన వచ్చిందని, బతుకమ్మ పాట సినిమాలోని భావోద్వేగాలను మరింతగా ప్రేక్షకులకు చేరువ చేస్తుందని అన్నారు. ఈ సినిమాలో బడ్డీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని తెలిపారు. నటి అనిషా, నటుడు శ్రీరామ్ చంద్ర కూడా పాటను ప్రశంసించారు.
* నవంబర్ 19న గ్రాండ్ రిలీజ్
విశ్వక్ సేన్, శ్రీనాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఈఎన్ఈ రిపీట్’ చిత్రానికి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ సినిమా నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

