
* ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ సందీప్
ఆకేరు న్యూస్, వరంగల్: విష సర్పాలు అయినప్పటికీ వాటిని పట్టి ఆడిస్తే కేసులు నమోదు చేస్తాం.. వన్యప్రాణులను సంరక్షించాలని ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ సందీప్
కోరారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూర్ గ్రామానికి చెందిన సయాద్ యాకుబ్ వరంగల్ బస్టాండ్ ఆవరణలో రెండు భారతీయ నాగుపాములను అక్రమంగా కలిగి ఉండి, డిఫాంజ్డ్ (దంతాలు తీసివేయబడ్డాయి), రన్నింగ్ పప్పెట్ షో ద్వారా ప్రజలను ఆకర్షిస్తూ డబ్బును వసూలు చేస్తున్నాడని తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకుని, విచారించి, డబ్ల్యుపీ యాక్ట్ – 1972 కింద వైల్డ్ లైఫ్ కేసు నమోదు చేసి, రిమాండ్ కోసం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగిందని తెలిపారు. అటవీ సిబ్బంది సాంబు, డబ్ల్యూజీఎల్, శ్రీను, ఎఫ్బీఓ సందీప్ తదితరులు పాల్గొన్నారు.
…………………..