* అర్ధరాత్రి ఒంటి గంట ఆటకు కూడా అనుమతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఈ నెల 27న పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ విడుదల కానుండగా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యంగ్ టైకర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం దేవర. భారీ బడ్జెట్‌తో ఈ మూవీ టికెట్స్‌ను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, ఈ నెల 26న అర్ధరాత్రి ఒంటిగంట షోలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 29 థియేటర్లలో అర్ధరాత్రి ఒంటిగంట షోకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే అర్ధరాత్రి ఒంటిగంట షోకు రూ.100 టికెట్ ధర పెంచుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది. మూవీ విడుదల రోజు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో రూ.100 పెంచుకునేందుకు.. అలాగే తొలిరోజు ఉదయం 4 గంటల నుంచి షోలు వేసుకునేందుకు అంగీకరించింది.
ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు తొమ్మిది రోజుల పాటు టికెట్ల ధరలను పెంచుకునేందుకు వీలు కల్పించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.25, మల్టిఫ్లెక్స్‌లలో రూ.50 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం రెండుపార్టులుగా తెరకెక్కనున్నది. తొలి పార్ట్ ఈ నెల 27న విడుదలవుతుండగా.. ఎన్టీఆర్ ఈ మూవీలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. జాన్వీకపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండడంతో సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు అభిమానులను అలరించాయి. సినిమా ఓపెనింగ్స్‌తో నుంచే కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ఎన్టీఆర్ అభిమానులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. ఏపీలోని ఇటీవల దేవర సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. ఈ క్రమంలో ఏపీలో సోమవారం నుంచి టికెట్ల అడ్వాన్స్డ్ బుకింగ్ మొదలైంది.
………………………………….