* రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దమ్ముంటే ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి(PATNAM MAHENDER REDDY) ఇంటిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్(MINISTER PONGULATI SRINIVAS) ఫామ్ హౌస్ ను, తన సోదరుడి ఇంటిని కూల్చాలని సీఎం రేవంత్ రెడ్డి(CM REVANTHREDDY)కి మాజీ మంత్రి కేటీఆర్(KTR) సవాల్ విసిరారు. కూకట్పల్లిలోని ఎఫ్టీఎల్ సందర్శనకు ఎమ్మెల్యేలతో కలిసిన వచ్చిన కేటీఆర్.. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంప్ ఆఫీసులతో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఒకలా, పెద్దోళ్లకు ఒకలా పనిచేస్తోందని విమర్శించారు. ప్రభుత్వంలోని పెద్దల అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లకుండా పేదల ఇళ్లను కూల్చడం అన్నాయమన్నారు. కూకట్పల్లిలో 100 % మురుగు నీటిని శుద్ధి చేసే విధంగా ఎస్టీపీలను ఏర్పాటు చేసి చివరి దశకు తెచ్చామన్నారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి(SABITHA INDRAREDDY), తలసాని శ్రీనివాస్ యాదవ్(TALASANI SRINIVASYADAV), మహమూద్ అలీ(MAHAMOODH ALI), ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు(MLC SAMBIPUR RAJU), ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు మాగంటి గోపీనాథ్ తదితరులు ఉన్నారు.
………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
