* తాడ్వాయి అటవీ ప్రాంతాన్ని సందర్శించిన వినోద్‌కుమార్
ఆకేరు న్యూస్, ములుగు : నేలకూలిన అడవిని సంరక్షించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో ఇటీవల భీకర గాలులతో నేలకూలిన వృక్షాలను, అటవీ ప్రాంతాన్ని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ డీఎఫ్ఓ, జన విజ్ఞాన వేదిక వరంగల్ జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ..అసలు ఇలాంటి ఘటన ఎప్పుడూ సంభవించలేదని.. మంత్రి సీతక్క నేలకూలిన అడవిని కాపాడేందుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయించాలని కోరారు. ప్రతి ఒక్కరికీి ప్రకృతి పట్ల ప్రేమ ఉండాలన్నారు. అలాగే బీజేపీ ఎంపీలు క్యాంప్ ఫండ్స్ ద్వారా నిధులు తీసుకురావాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏడాది హరితహారం కార్యక్రమం ద్వారా కోట్లాది మొక్కలు నాటామని.. కాంగ్రెస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఆటకెక్కించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తాడ్వాయి అడవుల్లో కూలిన చెట్ల స్థానంలో మళ్లీ మొక్కలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, మాజీ జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి, మాజీ గ్రంథాలయ చైర్మన్ గోవింద్ నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
…………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
