* లేకుంటే సీఎం రేవంత్ ఇంటి ముందు ధర్నా చేస్తా
* రెండు రోజుల్లో హరీశ్ భూముల వద్దకెళ్తా..
* నా కొడుకు మీద ఒట్టు.. అక్కడ డబ్బుకు బూజు పడుతోంది..
* నా ఆస్తి ప్రజలకు రాసిస్తా.. కేటీఆర్, హరీశ్ రాసిస్తారా..
ఆకేరు న్యూస్, గజ్వేల్ : కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు(MYNAMPALLY HANMANTHARAO) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్(RRR) ప్రాజెక్టు మాజీ మంత్రి హరీశ్‌రావు(HARISRAO) భూముల గుండా వెళ్లకపోతే సీఎం రేవంత్‌రెడ్డి(CM REVANTH) ఇంటి వద్ద ధర్నాచేస్తానన్నారు. మల్లన్నసాగర్(MALLANNA SAGAR) నిర్వాసితులను పరామర్శించిన మైనంపల్లి.. హరీశ్‌రావు, కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ నిర్వాసితులను కావాలనే రెచ్చగొడుతున్నారని, వారికి మల్లన్నసాగర్ నిర్వాసితులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. త్రిబుల్ ఆర్ ప్రాజెక్టు నుంచి హరీశ్ భూములను తప్పించారని, హరీశ్‌రావుకు షాద్‌నగర్(SHADNAGAR)లో 70 ఎకరాల భూములు ఉన్నాయని వెల్లడించారు. రెండు రోజుల్లో హరీష్ భూముల వద్దకు వెళ్తానన్నారు. నా కొడుకు మీద ఒట్టు.. కేసీఆర్ ఇంట్లో డబ్బులు బూజు పట్టిపో్యాయని, నా ఆస్తి, నా భార్య ఆస్తి ప్రజలకు రాసిస్తానని, కేటీఆర్, హరీశ్‌ల ఆస్తి ప్రజలకు రాసిస్తారా అని ప్రశ్నించారు. సిద్దిపేటలో హరీశ్‌రావు(HARISRAO) బండారం బయట పెడతానని మైనంపల్లి హెచ్చరించారు.
………………………………..