* ఆయన వల్లే చాలా మంది హీరోయిన్లు సినిమాల నుంచి తప్పుకున్నారు..
* ఎంతో మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు
* ఫోన్లు ట్యాపింగ్ చేశారు
* హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేశారు
* దుబాయ్ నుంచి నాపై పోస్టింగ్‌లు పెడుతున్నారు
* కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హీరోహీరోయిన్లు నాగచైతన్య- సమంత(Nagachaitanya – Samantha) జంట విడిపోవడానికి కారణం కేటీఆరే అని మంత్రి కొండా సురేఖ(Konda surekha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎంతో మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు. వారి ఫోన్లు ట్యాపింగ్(Phone Tapping) చేసి, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన వల్లే చాలా మంది హీరోయిన్లు తొందరగా సినిమాల నుంచి తప్పుకుని, పెళ్లిళ్లు చేసుకున్నారని విమర్శించారు. హీరోయిన్లకు మత్తు పదార్థాలను అలవాటు చేసి, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు. తనపై సోషల్‌మీడియా ద్వారా జరుగుతున్న ట్రోలింగ్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబాయ్(Dubai) నుంచి మూడు సోషల్‌మీడియా పోస్టింగుల ద్వారా తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మనసున్న మనిషిగా స్పందించి హరీశ్‌రావు(Harishrao) స్పందించారని, కేటీఆర్(Ktr) ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
…………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
