* రెపోరేటు తగ్గింపునకు ఆర్బిఐ విముఖం
* విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే నిర్ణయాలు
* గవర్నర్ శక్తికాంత్ దాస్
ఆకేరు న్యూస్, ముంబాయి: విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం ప్రకటించారు. రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడిరచారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది పదోసారి. 2024`25లో వాస్తవ జీడీపీ వృద్ధిరేటు అంచనా 7.2 శాతం. రెండో తైమ్రాసికంలో 7 శాతం, మూడు, నాలుగో తైమ్రాసికంలో 7.4శాతంగా ఉండే అవకాశం. 2025`26 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో 7.3శాతంగా వృద్ధి రేటు అంచనా వేసింది. మెరుగైన వర్షపాతం నమోదు, సరిపడా నిల్వలతో ఈ ఏడాది చివరికి ఆహార ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉంది. సెప్టెంబరులో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరగొచ్చని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5శాతంగా ఉండే అవకాశం ఉంది. తయారీ ఖర్చులు తగ్గడం, ప్రభుత్వ విధానాలు, దేశీయంగా పెరుగుతున్న డిమాండ్ తదితర కారణాలతో తయారీ రంగం వృద్ధి చెందుతోంది. ఆర్థిక రంగం స్థిరంగా ఉంది. బ్యాంకుల కార్యకలాపాలు బలంగా ఉన్నాయి. యూపీఐ లైట్ వాలెట్ పరిమితి రూ.2000 నుంచి రూ.5వేలకు పెంపు దేశంలోని సామాన్య ప్రజలకు ఈసారి కూడా ఉపశమనం లేదు. ఇఓఎల పెనుభారం తగ్గలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , తన పాలసీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. యథాతథంగా, 6.50 శాతం వద్ద కొనసాగించింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి రిజర్వ్ బ్యాంక్ తన రెపో రేటును అలాగే కొనసాగిస్తూ వస్తోంది. రెపో రేట్లో ఎలాంటి మార్పు చేయకుండా, యథతథంగా కొనసాగించడం వరుసగా ఇది పదో సారి. 2024లో ఇది వరుసగా ఐదోసారి. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడిరచారు. మానిటరీ పాలసీ కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు రెపో రేటు తగ్గింపును వ్యతిరేకించారు.
దేశంలో రెపో రేటును తగ్గించకూడదంటూ ఐదుగురు సభ్యులు ఓటు వేసినట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడిరచారు. ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం, 4 శాతం కంటే తక్కువగానే ఉన్నప్పటికీ, రెపో రేటులో కేంద్ర బ్యాంక్ ఎటువంటి మార్పు చేయలేదు. రెపో రేట్లో మార్పు ఉండదని మార్కెట్ ముందు నుంచీ ఊహిస్తోంది కాబట్టి, ఇదేవిూ ఆశ్చర్యకరమైన నిర్ణయం కాదు. ్గªపో రేట్ మారదని ముందు నుంచి సిద్ధమైన మార్కెట్, ఆర్బీఐ గవర్నర్ ప్రసంగంపై మాత్రం నిశితంగా దృష్టి పెట్టింది. భవిష్యత్ కార్యాచరణ గురించి ఆయన ఏం చెబుతారన్నది ఇటు సామాన్య ప్రజలకు, అటు కార్పొరేట్లకు చాలా కీలకం. దేశ ఆర్థిక వ్యవస్థకు మార్గనిర్దేశర చేసే వ్యాఖ్యలు గవర్నర్ ప్రసంగంలో ఉంటాయి కాబట్టి, ఆయన మాటలను అర్ధం చేసుకోవడం ముఖ్యం. ద్రవ్యోల్బణానికి ప్రపంచ ఉద్రిక్తతలు అతి పెద్ద ముప్పుగా పరిణమించాయని అన్నారు. లోహాలు, ఆహార పదార్థాల ధరల్లో ఇటీవలి పెరుగుదల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం ప్రమాదంలో ఉంది. 2024 జులై, ఆగస్టు నెలల్లో ప్రధాన ద్రవ్యోల్బణం పెరిగిందని, బేస్ ఎఫెక్ట్ కారణంగా చిల్లర ద్రవ్యోల్బణం భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. 2024`25 ఆర్థిక సంవత్సరంలో దేశంలో చిల్లర ద్రవ్యోల్బణం సగటున 4.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో తైమ్రాసికంలో (జులై`సెప్టెంబర్) ద్రవ్యోల్బణం 4.1 శాతంగా, మూడో తైమ్రాసికంలో (అక్టోబర్`డిసెంబర్) 4.8 శాతం, నాలుగో తైమ్రాసికంలో (జనవరి`మార్చి) 4.2 శాతం ఉండొచ్చని చెప్పారు. దేశంలో ద్రవ్యోల్బణం రేటును అదుపులో ఉంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇన్ప్లేషన్ అదుపులో ఉన్నట్లు కనిపించినప్పటికీ, ఆహార ద్రవ్యోల్బణం మాత్రం ఇప్పటికీ లక్ష్యానికి మించి ఉంది. అంటే, దేశంలో ఆహార పదార్థాల ధరలు అదుపులో లేవు. అందుకే, రెపో రేటును 6.50 శాతంగా కొనసాగించాలని కేంద్ర బ్యాంక్ నిర్ణయించింది. రెపో రేట్ తగ్గితే, బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి. రెపో రేట్ తగ్గించక పోవడంతో, కోట్లాది మంది రుణగ్రహీతలు, బ్యాంకు ఖాతాదార్లు నిరాశకు గురయ్యారు. వడ్డీ రేట్లు తగ్గితే లోన్ తీసుకుందామని ఎదురు చూస్తున్నవారికి కూడా ఇది నిరాశ కలిగించేదిగా ఉంది. పండుగ సందర్భంగా ఆర్బీఐ నుంచి మంచి నిర్ణయం వినొచ్చని ఎదురు చూస్తున్న ప్రజలంతా నిరుత్సాహపడ్డారు.
……………………………………….