* భయపెట్టేందుకే కొందరు నకిలీ ఇ`మెయిల్స్
* అప్రమత్తం అయిన పోలీసులు..దుండగుల కోసం ఆరా
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న సీఆర్పీఎఫ్ పాఠశాలల( CRPF SCHOOLS)కు బాంబు బెదిరింపులు వచ్చాయి. కేవలం భయపెట్టేందుకే కొందరు నకిలీ ఇ`మెయిల్‌ను పంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్ని పాఠశాలల గదుల్లో పేలుడు పదార్థాలు ఉంచామని, ఉదయం 11 గంటల్లోపు అన్ని స్కూళ్లను ఖాళీ చేయాలని దుండగులు అందులో హెచ్చరించారు. కాగా.. ఆదివారం ఉదయం దిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న సీఆర్పీఎఫ్ పాఠశాల సమీపంలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. పేలుడు తీవ్రతకు ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. పాఠశాల గోడ కూలిపోవడంతో పాటు సమీపంలో ఉన్న దుకాణాలు, కార్లు దెబ్బతిన్నాయి.
సవిూపంలోని మట్టి, అక్కడ గుర్తించిన తెల్లని పౌడర్ నమూనాలనూ ల్యాబ్‌కు పంపించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టాయి. ఇటీవల బాంబు బెదిరింపులు ఓ సమస్యగా మారాయి. గత కొద్దిరోజులుగా విమానయాన సంస్థలకు ఈ బూటకపు సందేశాలు ఎక్కువయ్యాయి. దాంతో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇటు ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. విమానయాన భద్రతే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు. బెదిరింపు కాల్స్, సోషల్ విూడియా పోస్టులకు పాల్పడేవారికి జీవిత ఖైదు విధించేలా చట్టపరమైన మార్పులు తెచ్చేందుకు యత్నిస్తున్నామన్నారు.
………………………………………….