* కాంగ్రెస్‌పై మరోసారి అసహనం వెల్లగక్కిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఆకేరున్యూస్, జగిత్యాల: చాలా రోజులుగా ఎన్నో అవమానాలను భరిస్తున్నానని ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి మరోసారి తన ఆవేదన వెల్లగక్కారు. కాంగ్రెస్ పార్టీపై తనకు ఎలాంటి కోపం లేదని.. ఇది తనకు సొంతిళ్లు లాంటిదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని.. కానీ ఇప్పుడు తన అనుభవమే ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. నేనూ కాంగ్రెస్ నాయకుడినే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని.. కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నాయని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ విధానాలకు ఫిరాయింపులు వ్యతిరేకమని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి చేరిన వారిపై అనర్హత వేటు వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఫిరాయింపులపై తన నిర్ణయం మాత్రం మారదని స్పష్టం చేశారు. అసలైన కాంగ్రెస్ నేతలు కూడా తాము కాంగ్రెస్సే అని చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు. పార్టీ ఫిరాయిస్తే సస్పెండ్ చేయాలని చట్టంలోనూ ఉందని గుర్తుచేశారు.
………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
