* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: ప్రతిభకు పేదరికం అడ్డురాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పవర్ లిఫ్టింగ్ క్రీడలో ప్రపంచ ఛాంపియన్గా ఎదిగిన ఆదివాసీ బిడ్డ, భద్రాచలం ఏజెన్సీ మారుమూల ఇప్పగూడెంలో పుట్టి ఇప్పుడు ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తోన్న పవర్ లిఫ్టర్ మోడం వంశీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మాల్టాలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో భారత్ తరపున సాధించిన బంగారు పతకం, ఇటీవల సౌతాఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో తాను సాధించిన బంగారు పతకాలను చూపించగా, ముఖ్యమంత్రి అభినందించారు. ప్రతిభకు పేదరికం అడ్డురాదని నిరూపిస్తూ, రోజుకూలీ ఇంట్లో పుట్టినా పట్టుదలతో ఈరోజు ప్రపంచ విజేతగా మోడం వంశీ ఇండియా కీర్తిని మరింత పెంచారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు ఉన్నారు.
……………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
