* ఖాన్‌కు మరోసారి బెదిరింపులు
ఆకేరు న్యూస్ డెస్క్ : బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్‌ఖాన్(SalmanKhan)ను చంపేస్తామని మళ్లీ బెదిరింపులు వచ్చాయి. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్(Mumbai Police Congrol Room) వాట్సప్ నంబర్‌కు ఈ మేరకు మెసేజ్ వచ్చింది. సల్మాన్ ను హత్య చేస్తామని ఇప్పటి వరకు మూడు సార్లు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. సల్మాన్ ఖాన్ సన్నిహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖి(Baba SidhiKhi) ఈనెల 12న హత్యకు గురయ్యాడు. అతడిని చంపింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్(Bistoy Gang) ప్రకటించుకుంది. అప్పటి నుండి సల్మాన్ ఖాన్‌కు కూడా బెదిరింపు కాల్స్, మెసేజులు వస్తున్నాయి. ముంబై ట్రాఫిక్ పోలీసులకు గతంలో కూడా వాట్సాప్ మెసేజ్ వచ్చింది. నిందితుడు హుస్సేన్ షేక్‌గా గుర్తించి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. జంషెడ్‌పూర్‌కి చెందిన హుస్సేన్ షేక్ కూరగాయల వ్యాపారి. కాల్ డేటా ఆధారంగా హూస్సేన్ ఆచూకీ గుర్తించిన ముంబై పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి ట్రాన్సిట్ ఆర్డర్‌పై ముంబైకి తీసుకొచ్చారు. రెండోసారి సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన కేసులో ముంబై పోలీసులు మరో వ్యక్తిని నొయిడాలో అరెస్ట్ చేశారు. నొయిడా కోర్టులో ట్రాన్సిల్ ఆర్డర్ తీసుకుని ముంబై తరలించారు. ఈ రెండు బెదిరింపు కేసులకు సంబంధించిన దర్యాప్తు ఇలా కొనసాగుతుండగానే మరోసారి బెదిరింపు మెసేజ్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సల్మాన్ ఖాన్(SalmanKhan) రూ. 2 కోట్లు ఇవ్వాలని, లేదంటే ఆయన్ని చంపేస్తామని దుండగులు ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు.
……………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
