* సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య సంవాదం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanthreddy), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Brs Working President Kcr) వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొరియా పర్యటనకు వెళ్లి వచ్చిన జర్నలిస్టులతో సచివాలయంలో మంగళవారం జరిగిన మాట్లాడిన రేవంత్.. కేసీఆర్(KCR)పై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు ఆయనను మరచిపోయేలా చేశానని, తాను ఫుట్బాల్ ప్లేయర్(FootBoll Player)నని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్తు కొనుగోళ్లపై విచారణ జరుగుతున్నదని, దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగా తప్పక చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. తనది చిన్న వయసని, రాజకీయంగా ఇంకా భవిష్యత్తు ఉందని, అణచివేతతో ప్రజాగ్రహాన్ని మూటగట్టుకోలేనని, ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తానని తెలిపారు. దీనిపై ఈరోజు కేటీఆర్ స్పందించారు.
చిట్టినాయుడూ.. నువ్వా కేసీఆర్ పేరును తుడిచేది? అంటూ కేటీఆర్(KTR) ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ చరితే కేసీఆర్ అన్నారు. ఆయన ఉద్యమానికి ఊపిరి పోసినవాడని, నువ్వు చెప్పులు మోసిన వాడివని వెల్లడించారు. నువ్వు పదవుల కోసం పరితపించిననాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసాడని బదులిచ్చారు. నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు.. ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టారని చెప్పారు. నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ(Telangana) భవిష్యత్ కు ఊపిరి పోశాడని ఎక్స్ వేదికగా అన్నారు.
…………………………………………………………