* సభా కార్యక్రమాలపై అవాగాహన పెంచుకోవాలి
* ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమలో చంద్రబాబు సూచనలు
ఆకేరున్యూస్, అమరావతి: సభలో ప్రతిపక్షం లేకున్నా.. మనం బాధ్యతగా ఉండాలని ఎమ్మెల్యేలకు సిఎం చంద్రబాబు నాయుడు ( AP CM CHANDRABABU) సూచించారు. వాళ్లకు బాధ్యత లేదు… కానీ మనకు ఉందని గుర్తించాలని అన్నారు. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం. ప్రజలకు ఏం అవసరమో… ప్రజలకు ఏం చేశామో చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక అన్నారు. ఏపీ అసెంబ్లీ ( AP ASSEMBLY) కమిటీ హాలులో ఎమ్మెల్యేలకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై మాట్లాడారు. రానురాను ఎమ్మెల్యేలకు స్జబెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతోందని.. ఇది మంచిది కాదని… నిరంతరం నేర్చుకోవాలి… తెలుసుకోవాలని సూచించారు. పని చేయాలన్న ఆసక్తి విూలో ఉంటే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో స్వాగతించరని.. గతంలో అదే జరిగిందన్నారు. శాఖల్లో ఏం జరుగుతుందో ఎమ్మెల్యేలకు అవగాహన లేకపోతే నియోజకవర్గానికి ఏం అవసరమో తెలియదన్నారు. బడ్జెట్ సమావేశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలని.. వచ్చే మంచి ఆలోచనలు సభలో పంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై ప్రతి ఎమ్మెల్యే అధ్యయనం చేయాలన్నారు. పబ్లిక్ గవర్నెన్స్‌లో ఎమ్మెల్యేలనూ భాగస్వామలను చేస్తామన్నారు. ప్రజలు ఎన్నో ఆశలు, నమ్మకం పెట్టుకున్నందున సమస్యలపై సభలో చర్చించాలని తెలిపారు. అర్థవంతమైన చర్చలకు సభ వేదిక కావాలన్నారు. వరుసగా విజయం సాధించడం అనేది మన పనితనం, పార్టీ నిర్మాణాన్ని బట్టి ఉంటుందన్నారు.
టీడీపీ నుంచి 61 మంది, జనసేన నుంచి 15 మంది, బీజేపీ నుంచి నలుగురు, వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికయ్యారని తెలిపారు. ఒకప్పుడు అసెంబ్లీ ప్రొసీడిరగ్స్ ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌లో వచ్చేవని.. కానీ ఇప్పుడు లైవ్, సోషల్ విూడియాలో కూడా ప్రసారం అయ్యే దాకా టెక్నాలజీ వచ్చిందన్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళకు సభలో పబ్లిక్ పాలసీలు రూపొందిస్తామని.. ఈ పాలసీలు ప్రజా జీవితంలో మార్పులు తెస్తాయని చంద్రబాబు అన్నారు. గతంలో కొందరు ఎమ్మెల్యేలను విదేశాలకు పంపి ఆయా దేశాలు సాధించే ఫాస్ట్ గ్రోత్ రేట్ గురించి స్టడీ చేయించామని గుర్తుచేశారు. మనం తెచ్చే పాలసీలే రాష్ట్రంలోని సమస్యలకు శాశ్వత పరిష్కారాలను చూపిస్తాయన్నారు. గతంలో ఒక స్జబెక్టుపై ఎంత సమయమైనా చర్చించేవాళ్లమన్నారు. విజన్-2047పై అందరి అభిప్రాయాలు తెలియజేయలని తెలిపారు. మంచి చర్చ, సమస్యల పరిష్కారానికి శాసనసభ, శాసన మండలి ఇకపై వేదికగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు నిరంతరం నేర్చుకోవాలని, తెలుసుకోవాలని సూచించారు. విజన్ 2047పై అందరి అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. పనిచేయాలనే ఆసక్తి ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుందని తెలిపారు.ప్రజలకు ఏం అవసరం.. మనం ఏం చేశామనేది చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో తమ ప్రతినిధి మాట్లాడుతున్నారని ప్రజలు గమనిస్తూనే ఉంటారని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమానికి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షత వహించారు.
…………………………………………………..