* ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇళ్లను కూల్చడమా
* ప్రజా వ్యతిరేక విధానాలతో కేసీఆర్ ఫాంహౌస్లో కూర్చున్నారు
* బస్తీ నిద్ర ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీజేపీ(BJP)పై కోపంతో పేదల ఇళ్లను కూల్చవద్దని, ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇళ్లను కూల్చడమా అని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(KISHANREDDY).. కాంగ్రెస్ సర్కారు(CONGRESS GOVERNMENT)ను ప్రశ్నించారు. అంబర్ పేట పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతంలో బస్తీ నిద్ర చేసిన కిషన్ రెడ్డి ఉదయం అల్పాహారం అనంతరం మీడియాతో మాట్లాడారు. పేదల ఇళ్లను కూల్చ కుండా మూసీ ప్రక్షాళన చేపట్టాలన్నారు. ముందుగా మూసీ రిటైనింగ్ వాల్ కట్టాలని, మురుగునీరు రాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రియల్ఎస్టేట్ వ్యాపారం (REAL ESTATE BUISINESS)కోసమే మూసీ పునరుజ్జీవం అంటున్నారని విమర్శించారు. మూడు నెలల పాటు మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉండేందుకు సిద్ధం అని ప్రకటించారు. రేవంత్ రెడ్డి బుల్డోజర్లకు ఇక్కడ ఎవరూ భయపడేది లేదని స్పష్టం చేశారు. గతంలో ఇలాగే ప్రజావ్యతిరేక విధానాలు అవలంబించి కేసీఆర్(KCR) ఇప్పుడు ఫాంహౌస్ లో కూర్చున్నారని విమర్శించారు.
…………………………………