
* కేసీఆర్ తెలంగాణ లో సాధించిన “నీలి విప్లవం”
* ఎక్స్ లో మాజీ మంత్రి కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దాచేస్తే దాగని సత్యం.. చెరిపేస్తే చెరగని చరిత్ర.. కేసీఆర్ తెలంగాణ లో సాధించిన
“నీలి విప్లవం” (Blue revolution) అని మాజీ మంత్రి కేటీఆర్(EX MINISTER KTR) అన్నారు. చేపల పెంపకం లో ఉత్తమ “ఇన్ ల్యాండ్ స్టేట్” గా తెలంగాణకు కేంద్రం అవార్డు ప్రకటించడంపై కేటీఆర్ స్పందించారు. 2016-17 లో 1.93 లక్షల టన్నుల చేపల పెంపకం నుంచి 2023-24 గు కు 4.39 లక్షల టన్నులు ఎగబాకింది కేసీఆర్(KCR) హయాంలోనేనని ప్రకటించారు. చేపల పెంపకంలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు తెలంగాణకు ఉత్తమ ఇన్‌ల్యాండ్ స్టేట్ అవార్డు దక్కింది. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న ఢిల్లీలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్‌సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, మత్స్యశాఖ డైరెక్టర్ ప్రియాంక ఆల, జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణన్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన కేటీఆర్.. జై తెలంగాణ(JAI TELANGANA) అని పోస్టు చేశారు.
……………………………………