* అప్రమత్తమైన పోలీసులు
* బాంబ్ డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్స్‌తో తనిఖీలు
ఆకేరున్యూస్, ఆగ్రా: తాజ్ మహల్‌ను బాంబులతో పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమై బాంబ్ డిస్పోజల్ టీమ్‌లను, డాగ్ స్క్వాడ్స్‌ను రంగంలోకి దింపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజ్‌మహల్ పర్యాటక విభాగానికి మంగళవారం ఇ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చిందని.. తాజ్ మహల్‌ను పేల్చివేస్తామని బెదిరింపు వచ్చిందని ఆగ్రా డీసీపీ సూరజ్ రాయ్ తెలిపారు. ప్రస్తుతం పర్యాటకులను బయటకు పంపి.. పోలీసు బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. కాగా, ఇ-మెయిల్ ఎవరు పంపారు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు తాజ్ మహల్ వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులను గుర్తించలేదన్నారు. తనిఖీలు నిర్వహించిన పోలీసులు తాజ్ మహల్ వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకకపోవడంతో బాంబు బెదిరింపు వట్టిదేనని తెలిపారు.
…………………………………