
టీని నీళ్లనుకొని తాగి…
* అనంతపురం జిల్లా యాడికిలో విషాదం
ఆకేరున్యూస్ అనంతపురం : ప్లాస్క్ లో ఉన్న వేడి వేడి టీని మంచినీళ్లు అనుకుని తాగిన ఇద్దరు చిన్నారుల్లో ఓ చిన్నారి గొంతులో గాయమై మృతిచెందిన సంఘటన అనంతపురం (ANANTHAPURAM) జిల్లా యాడికిలో చోటుచేసుకుంది. వేడి వేడి టీ ఓ చిన్నారిని బలి తీసుకుంది. తల్లి టీని ప్లాస్క్లో పోయగా మంచినీరనుకొని తాగిన నాలుగేళ్ల బాలుడు గొంతులో గాయమై మృతిచెందాడు.వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా యాడికి (YADIKI) మండలకేంద్రంలోని చెన్నకేశవ స్వామి కాలనీ(CHENNAKESHAVA SWAMY COLONY) లో నివాసముంటున్న రామస్వామి, చాముండేశ్వరి దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు హృతిక్ (HRITHIK)వయసు నాలుగేళ్లు కాగా, కూతురు యశస్వినికి ఏడాదిన్నర. రెండు రోజుల క్రితం చాముండేశ్వరి (CHAMUNDESHWARI) వేడి వేడి టీని ప్లాస్క్లో పోసి ఉంచింది. దాహంతో ఉన్న హృతిక్ ప్లాస్క్లో నీళ్లు ఉన్నాయనుకుని పొరపాటున వేడి వేడి టీ తాగేశాడు. గొంతు భగ్గుమనటంతో విలవిల్లాడి స్ప్రహ తప్పిపడిపోయాడు. వెంటనే తల్లిదండ్రులు వెంటనే అతడ్ని తాడిపత్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు.పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడినుంచి అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
……………………………………………………….