
* సత్యసాయి జిల్లాలో అమానుషం
* 13మంది కామాంధుల వికృతహేల
* మైనర్ బాలికపై అత్యాచార పరంపర
* కొంత కాలంగా కొనసాగుతున్న దారుణం
* కామాంధుల్లో పంచాయితీ పెద్దలు
* గర్భం దాల్చిన బాలిక
* ఆలస్యంగా వెలుగులోకి
* ఆరుగురి అరెస్ట్.. పరారీలో ఏడుగురు
ఆకేరు న్యూస్ డెస్క్: అభం శుభం తెలియని బాలిక జీవితం కొంత మంది కామాంధుల చేతిలో బలి అయింది. ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపాల్సిన బాల్యం కామాంధుల విష కౌగిట్లో నలిగిపోయింది. ఈ అమనవీయమైన అత్యంత హేయమైన ఘటన సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో జరిగింది. గత కొంత కాలంగా ఈ దారుణం జరుగుతున్నా ఆలస్యంగా జూన్ 5న వెలుగులోకి వచ్చింది. బాలిక 8 వ తరగతిలో ఉన్నప్పటినుంచి బాలిక క్లాస్ మెట్స్ ఈ అఘాత్యానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కామాంధుల్లో 50 ఏళ్ల వృద్ధుడితో పాటు ఓ రౌడీ షీటర్ ఉన్నాడని పోలీసులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు న్యాయం కోసం గ్రామపెద్దలను ఆశ్రయించగా వారు కూడా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు వివరించారు. ఎట్టకేలకు బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించగా పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేయగా మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. ఏడు గురి కోసం పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు. గర్భంతో ఉన్న బాలికను అనంతపురంలో ఉన్న సఖి సెంటర్ కు తరలించారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
………………………………………………………