
* జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ ఎస్ జైత్రయాత్ర
* మాగంటి సునీత నామినేషన్ కార్యక్రమంలోకేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ బీఆర్ ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఈరోజు మొదటి సెట్ నామినేషన్లు దాఖలు చేశారు. షేక్‌పేట మండల కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి ఆమె నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆమె బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr), మాజీ మంత్రులు పద్మారావు(Padmarao), తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivasyadav), మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి ఉన్నారు. అంతకు ముందు తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ.. పదేళ్ల అభివృద్ధికి, రెండేళ్ల అరాచక పాలనకు పోటీ జరుగుతోందని, ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని సూచించారు. పదేళ్ల రైతుబంధు పాలనకు, రెండు సంవత్సరాల రాక్షస పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నికగా పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ ఎస్ (BRS) జైత్రయాత్ర ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. తమ ఇళ్లు కూలగొట్టిన అరాచకాలను చూసిన తర్వాత, ఈ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి గెలవాలని, ఆ అరాచకాలు ఆగాలని హైదరాబాద్ నగర పేదలు కోరుకుంటున్నారన్నారు. మూతపడుతున్న బస్తీ దవాఖానాలు, ఉచిత తాగునీరు ఆగిపోతున్న విషయాలు ప్రజలందరూ చూస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కూడా హైదరాబాదులో కట్టలేదని విమర్శించారుఎ. కాంగ్రెస్ (Congress) చేతిలో మోసపోయిన మైనార్టీలకు ఈ ఎన్నిక ఒక అవకాశంగా భావిస్తున్నారని.. ప్రభుత్వంలో ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వకుండా దారుణంగా వారిని అవమానపరిచిన మైనార్టీలు, ఈ ఎన్నికను రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి ఒక అవకాశంగా భావిస్తున్నట్లుగా చెప్పారు.
…………………………………………………………………………