
* బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్కటయ్యారు
* గోదావరి జలాలను పక్కరాష్ట్రాలకు తరలిస్తారు
* బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్ , హనుమకొండ : కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసే కుట్ర జరుగుతోందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం ఆయన పార్టీ కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ లు కుట్ర పన్ని గోదావరి జలాలను పక్క రాష్ట్రాలకు తరలిస్తాయని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయాన్ని సీబీఐకి ఇచ్చినా ,దేనికైనా ఇచ్చినా భయపడేది లేదు అని కేటీఆర్ అన్నారు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి,బండి సంజయ్ లు కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని సీబీఐకి అప్పగించాలని రేవంత్ కు సూచించారని కేటీఆర్ అన్నారు.బెదిరింపులు,కేసులు కొత్తేం కాదని ఎన్ని కుట్రలనైనా తిప్పకొడతాం అని కేటీఆర్ అన్నారు.ఇదిలా ఉండగా బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేయనున్నారు.ధర్నాలు,రాస్తారోకోలు,బైక్ ర్యాలీలు చేయడానికి పార్టీ శ్రేణులు సిద్ధపడుతున్నాయి.
…………………………………