
* బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
* ముఖ్దూం భవన్ లో నివాళి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి లేని లోటు తీర్చలేనిది అని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మఖ్దూం భవన్ లో ఉన్న సురవరం పార్థివ దేహానికి కేటీఆర్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి సామాన్యుడి స్థాయినుంచి అసాధారణ నేతగా ఎదిగారని కొనియాడారు. విద్యార్థినాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక జాతీయ పార్టీకి ప్రధాన కార్యాదర్శిగా ఏడేండ్ల పాటు బాధ్యతలు నిర్వహించమంటే సామాన్యవిషయం కాదని కేటీఆర్ అన్నారు. చెప్పారు. ప్రజా సమస్యలను తీర్చడంలో ఆయన అంకిత భావంతో పనిచేసేవారని కేటీఆర్ అన్నారు.తెలంగాణ ఏర్పాటుకు సీపీఐ మద్దతులో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణకు మద్దతు కూడగట్టడంలో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి దక్కిందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ వారితో ఉన్న అనుభవాలను గుర్తుచేసుకున్నారని, వారి తరపున సువరం సుధాకర్ రెడ్డికి నివాళులర్పిస్తున్నామని చెప్పారు. సురవరం కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కేటీఆర్‌తోపాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే తక్కళ్లపల్లి రవిందర్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్, మధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేశ్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
…………………………………