
* దేవాదాయ, ధర్మాదాయ,అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ
* జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి
ఆకేరు న్యూస్, హనుమకొండ : తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకే పనిచేస్తోందని
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.79 వ స్వాతంత్ర వేడుకుల సందర్భంగా జిల్లా కేంద్రంలో జాతీయ జెండాను ఎగురవేసి జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మహాత్మా గాంధీ సారధ్యంలో బయటి శత్రువులైన ఆంగ్లేయులతో పోరాటం చేస్తే మొట్ట మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సారధ్యంలో అంతర్గత శత్రువులైన పేదరికం,అసమానతలు,అస్పృశ్యత,అంటరాని తనంపై పోరాడి వాటిని రూపుమాపాం అని కొండా సురేఖ అన్నారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తోందన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని కొండా సురేఖ అన్నారు. హనుమ కొండ జిల్లాలో చేపట్ఇన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆమె వివరించారు.
రైతు రుణ మాఫీ….
రైతు రుణ మాఫీ ద్వారా జిల్లాలో 54 వేల 734 మంది రైతులకు 450.09 కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. రైతు భరోసా ద్వారా జిల్లాలో 1 లక్షా 44 వేల 192 మంది రైతలకు మొదటి విడతగా రూ. 6వేల చొప్పున 152 కోట్ల 76 లక్షలు అందించామన్నారు. రైతు బీమా ద్వారా 333 మంది రైతు కుటుంబాలకు రూ 5 లక్షల చొప్పున 16 కోట్ల 65 లక్షలు చెల్లించామన్నారు.
మహాలక్ష్మి పథకం ద్వారా..
మహాలక్ష్మీ పథకం ద్వారా జిల్లాలో 9 కోట్ల 12 లక్షల మంది మహిళలను ఉచితి రవాణా సౌకర్యం కల్పించామన్నారు. దీని ద్వారా రూ. 372.99 కోట్ల లబ్ధి పొందారన్నారు.దీపం పథకం ద్వారా 48 వేల 9 వందల 65 గ్యాస్ కనెక్షన్లను ఇచ్చాం అన్నారు. వైద్య ఆరోగ్యం…జిల్లాలో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 7 పట్టణ ఆరోగ్య కేంద్రాలు,3 బస్తీ దవాఖానలు 1 పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం,2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ,3 టీచింగ్ ఆస్పత్రుల ద్వారో ఆరోగ్య సేవలు అందిస్తున్నామన్నారు.
రాజీవ్ ఆరోగ్య శ్రీ…
రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా జిల్లాలో ఏప్రిల్ 2024 నుంచి ఇప్పటి వరకు రూ. 54కోట్ల 19లక్షల ఖర్చుతో 21 వేల 146 మంది పేదలకు వైద్య చికిత్సలు అందించామన్నారు.
ప్రజాపంపిణీ…
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా జిల్లాలో 2 లక్షల 31 వేల ఆహారభద్రత కార్డులకు 414 రేషన్ షాపుల ద్వారా ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యం నిత్యావసర వస్తువల పంపిణీ చేశామన్నారు.
చేయూత పెన్షన్లు….
జిల్లాలో చేయూత పెన్షన్ పథకం కింద 1 లక్షా 2వేల మంది వృద్ధాప్య,వితంతు,దివ్యాంగ,చేనేత
కల్లుగీత,ఒంటరి మహిళ, బీడీ కార్మికులు, బోదకాలు ,ఎయిడ్స్, డయాలిసిస్ వ్యాధిగ్రస్తులకు నెలకు 25 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు.
స్త్రీ నిధి.. వడ్డీలేని రుణాలు…
2025-26 కు గాను 680 మహిళా స్వయం సహాయక సంఘాలలోని 1,477 సభ్యులకు ఇప్పటి వరకు రూ. 15.10
కోట్లురుణ సహాయం అందించామన్నారు.2025-26 కు గాను 8వేల 6 వందల మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 22.21 కోట్ల రుణం అందించామన్నారు.
గృహజ్యోతి…
జిల్లాలో అర్హులైన 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న లక్షా 25 వేల మంది గృహజ్యోతిని వినియోగించుకుంటున్నారు.
ఇందిరమ్మ ఇళ్లు..
జిల్లాలో 2వేల 480 డబుల్ బెడ్ రూంలు మంజూరు కాగా 2 వేల 168 గృహాలు పూర్తయ్యాయి. 312 గృహాలు పురోగతిలో ఉన్నాయి.
నేతన్న రుణమాఫీ…
జిల్లాలో 110 మంది చేనేత కార్మికులకు వర్కింగ్ క్యాపిటల్ కింద తీసుకున్న రుణాలను రూ. 45 లక్షల 90 వేలు మాఫీ కోసం సిఫారసు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మందుకు తీసుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి కి , జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారులు పోలీస్ సిబ్బంది, న్యాయాధికారులు
స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమ కారులు, స్వచ్చంధ సంస్థలు,జర్నలిస్టులు జిల్లా ప్రజలందరికీ మంత్రి కొండా సురేఖ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
………………………………………………………….