
* వైద్య శాస్త్రంలో అరుదైన ఘటన
ఆకేరు న్యూస్ డెస్క్ : ఓ మహిళ కాలేయంలో పిండం పెరుగుతున్న అరుదైన సంఘటన ఉత్తరప్రదేశ్ (UTTAR PRADESH) లోని బులంద్ షహర్ ( BULAND SHAHAR)లో చోటుచేసుకుంది. కడుపునొప్పితో బాధ పడుతున్న ఆ మహిళ మీరట్ (MEERAT)లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం కోసం వెళ్లగా ఆమె ను పరీక్షించిన వైద్యులకు ఆశ్చర్యకరమైన విషయం బైట పడింది. సదరు మహిళ కాలేయంలో పిండం (developing fetus in liver)పెరుగుతున్నట్లు వైద్యులు గుర్తించారు. మహిళను అబ్డోమెన్ స్కానింగ్ చేయించుకోవాలని వైద్యులు సూచించగా ఆ మహిళ ను పరీక్షించిన సీనియర్ రేడియాలజిస్ట్ డాక్టర్ కె.కె.గుప్తా (DOCTOR KK GUPTHA)ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమె కాలేయంలో 12 వారాల పిండం అభివృద్ధి చెందుతున్నట్లు గుర్తంచారు.
ఇంట్రాహెపాటిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (Intrahepatic Ectopic Pregnancy)
కాలేయంలో పిండం పెరగడాన్నిఇంట్రాహెపాటిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (Intrahepatic Ectopic Pregnancy) అని పిలుస్తారని డాక్టర్ కె.కె.గుప్తా తెలిపారు, ఇది చాలా అరుదైన పరిస్థితి అని తెలిపారు. ప్రపంచంలో ఇప్పటివరకు ఇలాంటి 8 కేసులు మాత్రమే నమోదయ్యాయని ఆయన చెప్పారు. ఈ పరిస్థితి తల్లి, బిడ్డ ఇద్దరికీ అత్యంత ప్రమాదకరమైనది ఆయన అన్నారు. వెంటనే గైనకాలజిస్ట్ ను సంప్రదించాల్సిందిగా మహిళకు డాక్టర్ గుప్తా సూచించారు.
ప్రపంచంలోనే అరుదైన కేసు
కాలేయంలో పిండం పెరగడం అనేది ప్రపంచంలోనే అరుదైన కేసు అని
లాలా లజపత్ రాయ్ మెడికల్ కాలేజీ(LALA LAJPATHIRAI MEDICAL COLLEGE)లోని స్త్రీ, ప్రసూతి విభాగం గైనకాలజిస్ట్ డాక్టర్ అరుణా వర్మ అభిప్రాయపడ్డారు. తన కెరీర్లో ఇలాంటి కేసును మొదటిసారి చూశానని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
………………………………………….