
* నోటి పరిశుభ్రతపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.
* నోటి సమస్యలను నిర్లక్ష్యం చెయొద్దు
* జాతీయ దంతవైద్యుల దినోత్సవం సందర్భంగా 2కే వాకథాన్‌ను ప్రారభించిన ఎంపీ కడియం కావ్య
ఆకేరున్యూస్, హన్మకొండ: జాతీయ దంతవైద్యుల దినోత్సవం సందర్భంగా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కే వాకథాన్‌ను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. హన్మకొండ కలెక్టరేట్ నుండి పబ్లిక్ గార్డెన్ వరకు నిర్వహించిన వాక్‌లో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ…న ోరు బాగుంటే ఆరోగ్యం బాగుంటుందన్నారు. నోటి పరిశుభ్రతను కాపాడుకోవడం ద్వారా, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు, అనారోగ్యాల ముప్పును కూడా తగ్గించవచ్చని తెలిపారు. నోటి పరిశుభ్రతపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. నోటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని అప్పుడే ఆరోగ్యాన్ని కపాడుకోవచ్చని పేర్కొన్నారు. దంత సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న డెంటల్ వైద్యులను ఎంపీ అభినందించారు. గ్రామీణ స్థాయిలో దంత సమస్యలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ IDA మాజీ అధ్యక్షులు డా.జయసింహ రెడ్డి, వరంగల్ IDA సెక్రెటరీ వేణుయాదవ్, మరియు డా. రామ్ ప్రసాద్ రెడ్డి, డా. కార్తిక్, డా.నరేష్ ఇతర డేంటల్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
………………………………….