Station Ghanpur House Fire by short circuit
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం రాఘవాపూర్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు (రేకుల షెడ్డు) పూర్తిగా దగ్ధం అయ్యింది. గ్రామానికి చెందిన బెజ్జం రాజు-రజిత దినసరి కూలీ తో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
శుక్రవారం ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది ఈ ప్రమాదంలో ఇంట్లో దాచిన రూ. 50 వేల నగదు, పిల్లల సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్స్, బ్యాంక్ పాస్ బుక్కులు మంటల్లో కాలి బూడిద అయ్యాయి. ఈ ప్రమాదంతో సుమారు 2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యవసర వస్తువులు, బట్టలు, పూర్తిగా దహనం కావడంతో, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు రాజు రజితను కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
