Bollepalli Narsapur Road Development
* బొల్లె పల్లి ,నర్సాపూర్ రోడ్డు మార్గాన్ని పరిశీలించిన ఇంజనీరింగ్ అధికారుల బృందం
ఆకేరు న్యూస్, ములుగు:
మండలంలోని బోలే పల్లి నుండి నర్సపూర్ వరకు గల బిటి రోడ్డు, తో పాటు మార్గమధ్యలో గల మూడు వంతెనలు నిర్మించేందుకు ఇంజనీరింగ్ అధికారుల బృందం శనివారం ఆయా గ్రామాలను సందర్శించి పరిశీలించారు.
ఈ గ్రామాలకు పూర్తిస్థాయిలో రోడ్డు మార్గం లేకపోవడంతో ఏజెన్సీ గిరిజన ప్రజలు ఈ ప్రాంతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల సమస్యలు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క దృష్టికి బంధాల సర్పంచ్ శ్రీలత ప్రశాంత్, తీసుకెళ్లారు.దీనిపై స్పందించిన మంత్రి వెంటనే ఆయా గ్రామాల రోడ్డు ఏర్పాటుకు వంతెనల, నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించడంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులకు డి ఈ ఈ ధర్మేందర్ రావు , ఏఈఈ రజనీకాంత్ అద్వర్యం లో ఎన్ఐటి ప్రొఫెసర్లు శంకర్ ,రాజేష్‌కుమార్ లు ఆయా గ్రామాలకు వెళ్లి రోడ్డు మార్గాలను వంతెన నిర్మాణాలకి తీసుకోవలసిన విధానాలను సమగ్రంగా పరిశీలించి ప్రణాళికలు సిద్ధం చేసి మంత్రికి అందజేయనున్నట్లు వివరించారు. దీంతో ఆ గ్రామాల ప్రజలు వెంటనే స్పందించి అధికారులను ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించినందుకు గ్రామస్తులు మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో నర్సాపూర్, బొల్లెపల్లి ,బంధాల, అల్లిగూడెం గ్రామస్తులు పాల్గొన్నారు .


Please tell us what is wrong. Your report will be sent to the website team.
