
– మధ్యాహ్నం 1.30లోగా నిమజ్జన లక్ష్యం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనానికి బయలుదేరాడు. అశేష భక్తజనం వెంట నడుస్తుండగా భారీకాయుడు అట్టహాసంగా ముందుకు కదులుతున్నాడు. దారిపొడవునా భక్తులు ఆయనకు జేజేలు పలుకుతున్నారు. అనుకున్న సమయానికి కార్యక్రమం మొదలయ్యేలా పోలీసులు దగ్గరుండి మరీ రాత్రంతా పనులను పర్యవేక్షించారు. విశ్వశాంతి మహాశక్తి గణపతి నిమజ్జనంపై ప్రభుత్వ విభాగాలు ప్రత్యేక దృష్టి సారించాయి. నిమజ్జన ఘట్టంలో కీలకమైన ఈ ఏకదంతున్ని గంగ ఒడికి తరలించేందుకు గత కొన్నేళ్లుగా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు గణపతి నిమజ్జనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రణాళికలో భాగంగానే 24 గంటల ముందు నుంచే బడా గణేష్‌ని దర్శనాలు ఆపేశారు. మహా గణపతి నిమజ్జనం సందర్భంగా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్‌లో 25అడుగుల లోతు వరకు పూడికతీశారు. హుస్సేన్‌సాగర్‌లో ఖైరతాబాద్ గణేష్‌ను నిమజ్జనం చేసిన సందర్భంలో పూర్తి స్థాయిలో మునిగేందుకు మూడేళ్లుగా పూడిక తీస్తున్నారు. ఈ ఏడాది కూడా హుస్సేన్‌సాగర్‌లో ఖైరతాబాద్ గణనాథుడిని పూర్తిస్థాయిలో మునిగేందుకు వీలుగా చర్యలు చేపట్టారు. నిమజ్జనం జరిగే ఎన్టీఆర్ మార్గ్ వెంట హుస్సేన్‌సాగర్‌లో ఇటీవల నిర్వీరామంగా పూడిక తీశారు.
………………………………………………..