 
                * టెక్నాలజీతో ముప్పు కూడా ఉంది
* ఏక్తా దివస్ లో మెగాస్గార్ చిరంజీవి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భారత దేశ ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ఏక్తా దివస్ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో ‘రన్ ఫర్ యూనిటీ’ (Run For Unity) కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ పోలీసులు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హాజరయ్యారు. జెండా ఊపి 2 కిలోమీటర్ల రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీప్ ఫేక్ వీడియోలపై ఆయన స్పందించారు. టెక్నాలజీని ఆహ్వానించాలి కానీ.. దాని వల్ల ముప్పు కూడా ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. డీప్ ఫేక్ (Deep Fake) నివారణకు చట్టాన్ని తీసుకువచ్చే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు. లేకపోతే భవిష్యత్ లో మరిన్ని ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. అందరూ ‘రన్ ఫర్ యూనిటీ’ టీ-షర్టులు ధరించి, ఐక్యతా సందేశాలతో కూడిన బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకొని ప్రదక్షిణ చేశారు. సర్దార్ పటేల్ దేశాన్ని 562 రాజ్యాలను ఏకీభవించి ఐక్య భారతదేశంగా నిర్మించిన గొప్ప నాయకుడనీ, ఆయన ఆశయాలను ప్రతి భారతీయుడూ గుర్తుంచుకోవాలని చిరంజీవి ప్రసంగించారు.దేశాన్ని వన్ నేషన్‌గా మార్చిన సర్దార్ తనకు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి.శివధర్ రెడ్డి, ఐపీఎస్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తదితర సీనియర్ పోలీస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, యువత, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
……………………………………………..

 
                     
                     
                    