
* ముగ్గురు ప్రయాణికులు మృతి
ఆకేరున్యూస్, జనగామ: జనగామ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. పాలకుర్తి మండలం సమీపంలో నిర్లక్ష్యంగా వస్తున్న లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన మరొకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు పాలకుర్తి నుంచి తొర్రూరుకు వెళ్తోంది. ఈ క్రమంలో వావిలాల గ్రామ శివారు సబ్ స్టేషన్ సమీపంలో వైజాగ్ నుంచి వస్తున్న లారీ ఎదురుగా వచ్చి బస్సును ఢీ కొట్టింది. ప్రమాదానికి కారణం లారీడ్రైవర్ నిద్రమత్తే కారణమని ప్రయాణికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.