
* కట్నం వేధింపులు.. పెద్దల సూటిపోటీ మాటలు..
* మనస్తాపంతో పురుగుల మందు తాగిన భర్త.. అదే మందు తాగిన భార్య..
ఆకేరు న్యూస్, కొత్తగూడెం : ఇద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యుల వేధింపులు ఆరు నెలలు కూడా వారిని బతకనీయలేదు. అటు కుటుంబ సభ్యులకు, ఇటు భార్యకు నచ్చ చెప్పలేక కూల్ డ్రింక్‌లో గడ్డి, ఎలుకల మందు కలుపుకుని తాగాడు భర్త. ఆ విషయం భార్యకు చెప్పాడు. ఆమె కూడా ఆ కూల్‌డ్రింక్ లాక్కుని తాగేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ తనువు చాలింభారు. ఆమె ప్రస్తుతం మూడో నెల గర్భవతి. ఈ విషాదకర ఘటన కొత్తగూడెం జిల్లా (KOTHAGUDEM DISTRICT) టేకులపల్లిలో విషాదం చోటుచేసుకున్నది. టేకులపల్లి (TEKULAPALLI) మండలం దాస్ తండా గ్రామపంచాయతీ రేగుల తండాకు చెందిన ఇస్లావ దీపిక (19), వెంకట్యా తండాకు బోడ శ్రీను(23) ప్రేమించుకున్నారు. వారి వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో కుటుంబాన్ని ఎదిరించి ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులపాటు కుటుంబానికి దూరంగా ఉన్న యువజంట.. ఆ తర్వాత వెంకట్యా తండాలోని శ్రీని నివాసానికి వచ్చారు. రెండు నెలలుగా కుటుంబ సభ్యులు వరకట్నం కోసం ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారిమధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీపిక ప్రస్తుతం మూడు నెలల గర్భవతి. అయితే కుటుంబ కలహాలతో విసిగిపోయిన శ్రీను.. ఈ నెల 24న కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకొని తాగాడు. తర్వాత ఈ విషయం భార్యకు తెలిపాడు. దీంతో ఆమె కూడా ఆ కూల్‌డ్రింక్ తాగింది. కుటుంబ సభ్యులు భార్యాభర్తలను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దీపిక ఈనెల 25న దీపిక, ఆదివారం అర్ధరాత్రి శ్రీను చనిపోయారు.
………………………………………………