
* బస్సులో మంటలు
* డ్రైవర్ సమయస్ఫూర్తితో బయటపడ్డ ప్రయాణికులు
ఆకేరు న్యూస్ డెస్క్ : డ్రైవర్ సమయస్ఫూర్తి ప్రదర్శించడంతో ఓ పెను ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల శివారులో మంగళవారం ఉదయం ఎమ్మిగనూరు-కర్నూలు ప్రధాన రహదారిలో 30మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు గోనెగండ్ల శివారుకు చేరుకోగానే ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ తిమ్మన్న బస్సును నిలిపివేశాడు. ప్రయాణీకులను కిందకు దింపి వేశారు. స్థానికులు నీళ్లు చల్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. డ్రైవర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
…………………………………..