
* ఖమ్మంలో భార్య మృతి తట్టుకోలేక భర్త మృతి
ఆకేరు న్యూస్, ఖమ్మం: జిల్లాలోని నేలకొండపల్లి మండలం రామచంద్రాపురంలో విషాదం చోటుచేసుకుంది. నీ తోడే నేను.. నీ వెంటే నేను.. కష్టాల్లో అయినా.. సుఖాల్లో అయినా.. నీ తోనే అంటూ.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని.. ఇద్దరు దంపతులు కొద్ది నిమిషాలు తేడాలోనే ఊపిరి వదిలారు. భార్య యశోద (Yashodha) మృతి తట్టుకోలేక భర్త హనుమారెడ్డి (Hanumareddy) గుండెపోటుతో మృతి చెందాడు. ఇంటిముందున్న దర్వాజా తగిలి యశోద కిందపడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ విషయం తెలియగానే హనుమారెడ్డి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
……………………………………………….