* బెంబేలెత్తిన ప్రయాణీకులు
* ఖమ్మం రైల్వే స్టేషన్లో పట్టుకున్న మస్తాన్
ఆకేరు న్యూస్, వరంగల్ : అండమాన్ రైలులో కొండ చిలువ కలకలం రేపింది. కదులుతున్న రైలులో కొండ చిలువ ప్రత్యక్షమవడంతో ప్రయాణీకులు భయభ్రాంతులకు లోనయ్యారు. వరంగల్ నుంచి విజయవాడ వెళ్లే అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ 2 భోగీలోని ప్రయాణికులు మూత్రశాల వద్ద కొండ చిలువను గమనించారు. ఖమ్మం ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు ఖమ్మం పట్టణానికి చెందిన పాములు పట్టే మస్తాన్ సాయం కోరారు. ఖమ్మం రైల్వేస్టేషన్‌కు రప్పించి రైలు ఆగగానే మస్తాన్ బోగి వద్దకు వెళ్లి కొండ చిలువను పట్టకున్నాడు. దీంతో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. పాములు పట్టే మస్తాన్‌ను పోలీసులు అభినందించారు. మస్తాన్ వెంటనే స్పందించి పోలీసులకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
…………………………………….
