ఆకేరు న్యూస్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూలు మండలం ప్రభుత్వం పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ ఓ బాలుడు మృతి చెందాడు. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఉపాధ్యాయులు.. పిల్లలతో ఆటలాడిస్తున్నారు. 9వ తరగతి విద్యార్థి బన్నీ(14) ఖోఖో ఆడుతున్నాడు. ఆడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. బాలుడు బన్నీకి గతంలో గుండెకు స్టంట్లు వేసినట్లు సమాచారం.
……………………………………….