
– గుండేడు గ్రామంలో విషాదం
ఆకేరు న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు గ్రామంలో ట్రాలీ ఢీకొని ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది. కమలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ కథనం ప్రకారం గుండెడు గ్రామానికి చెందిన కాలేశ శ్రీకాంత్ – తిరుమల ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం.మూడవ సంతానమైన ఏడాదిన్నర రిషిక మంగళవారం ఉదయం ఇంటి ముందు ఉండగా హసన్పర్తి గ్రామానికి చెందిన గుండమీది శ్రీనివాస్ అల్లం,ఎల్లిగడ్డలు అమ్మే ట్రాలీ వేగంగా ఢీ కొట్టిందనీ తెలిపారు. చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు.
………………………………………