
ఆకేరు న్యూస్ డెస్క్ : బీహార్లోని బెట్టియా గ్రామంలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది.
గోవిందా అనే ఏడాది వయసున్న బాలుడు ఇంటి ముందు అరుగుపై ఆడుకుంటుండగా ఓ పాము పాక్కుంటూ బాలుడి వద్దకు వచ్చింది. పామును ఆట వస్తువుగా భావించిన ఆ బాలుడు చేతిలోకి తీసుకొని పామును కొరికాడు. బాలుడు పామును కొరకడంతో పాము అక్కడికక్కడే చనిపోగా బాలుడు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు బాబును ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాబును పరీక్షంచిన వైద్యులు బాబుని పాము కాటు వేయలేదని నిర్ధారించారు. పామును కొరికినందుకు బాబు స్పృహ తప్పినట్టు తెలిపారు. బాబు ప్రాణాలకు ఎలాంటి భయంలేదని క్షేమంగానే ఉన్నాడని తెలుపారు.
………………………………………..