
ఆకేరు న్యూస్, ములుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలలో భాగంగా వికలాంగుల కు 6000/- చేయుత పెన్షన్ దారుల పెన్షన్4000/- హెచ్చింపు నూతన పెన్షన్లు దారులకు పెన్షన్ 4000/- మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు.అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను తహసిల్దార్ కార్యాలయాలలో అధికారులకు అందజేశారు. ఈసందర్భంగా పలువురు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ,జిల్లా, మండల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల వికలాంగులు వృద్ధులు వితంతువులు నూతనంగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి పెన్షన్దారునికి పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తాడువాయిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు గజ్జేలప్రసాద్, పుల్లూరి కరుణాకర్, మంతెన సారంగపాణి, దుర్గారావు, మోకాళ్ళ నారాయణ, తో పాటు వృద్ధులు, వితంతువులు, వికాలాంగులు, ఒంటరి మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
……………………………………….