
* అదుపుతప్పి.. ఇంటి గోడెక్కిన కారు..
* మేడ్చల్ జిల్లాలో ఘటన..
ఆకేరున్యూస్, హైదరాబాద్ : తెల్లవారుజామున లేచిన వెంటనే ఓ ఇంటి గోడపై ఉన్న కారును చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. పోలీసులకు ఫోన్ చేశారు. వారు అక్కడకు చేరుకుని ఎక్స్ కవేటర్ సహాయంతో కారును దించి వివరాల కోసం ఆరా తీయగా.. మేడ్చల్ జిల్లా (MEDCHAL DISTRICT) దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని శంభీపూర్లో కారు బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఎగిరి పక్కనే ఉన్న ఇంటి గోడపై పడింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం గోడపై ఉన్న కారును చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు క్రేన్ (CRANE) సహాయంతో కారును కిందికి దించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ఇంటి యజమానులు ఉలిక్కిపడ్డారు.
………………………………………